మళ్లీ హీరోగా మారబోతున్న కమెడియన్

హీరో పాత్రల నుంచి పూర్తిగా తప్పుకున్నాడు కమెడియన్ సునీల్. అయితే అతడి మనసులో నుంచి మాత్రం హీరో ఆలోచనలు పూర్తిగా తప్పుకోలేదు. నటుడిగా ఇప్పుడు క్రేజ్ తెచ్చుకున్న సునీల్, మరోసారి హీరోగా నటించాలని ఉబలాటపడుతున్నాడు. ఇందులో భాగంగా త్వరలోనే తను హీరోగా కొన్ని ప్రాజెక్టులు ప్రకటించబోతున్నాడు.

నిజానికి సునీల్ దగ్గర 2 సినిమాల అడ్వాన్సులు ఉన్నాయి. ఆ సినిమాల్లో అతడు హీరోగా నటించాల్సి ఉంది. కానీ వరుసగా ఫ్లాపులు రావడంతో, వాటిని పక్కనపెట్టాడు. పుష్ప, అల వైకుంఠపురములో లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేయడం మొదలుపెట్టాడు. అలా మరోసారి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో ఇప్పుడు తిరిగి హీరోగా నటించడానికి రెడీ అవుతున్నాడు సునీల్.

ఎఫ్ 3 సినిమా తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని సునీల్ భావిస్తున్నాడు. సినిమా రిలీజైన తర్వాత తనకు మరింత పేరు వస్తుందని భావిస్తున్నాడు. అప్పుడు హీరోగా కొత్త సినిమాలు ప్రకటించే ఆలోచనలో సునీల్ ఉన్నట్టు తెలుస్తోంది. హీరోగా సునీల్, అందాల రాముడు, మర్యాదరామన్న లాంటి హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే.

 

More

Related Stories