
హీరో వేషాలు పక్కన పెట్టి విలన్ గా, క్యారక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు సునీల్. ‘కలర్ ఫోటో’లో పోషించిన విలన్ పాత్ర బాగా పేరు తెచ్చింది సునీల్ కి. అలాగే, ఇప్పుడు అనిల్ రావిపూడి తీస్తున్న “ఎఫ్ 3″లో చాలా పెద్ద పాత్ర చేస్తున్నాడట. “ఎఫ్ 2″కి సీక్వెల్.
“ఎఫ్ 2″లో నటించిన వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్… ఇలా మెయిన్ నటులందరూ రిపీట్ అవుతున్నారు. ఇందులో స్పెషాలిటీ సునీల్ పాత్ర. ఇది కామెడీ రోల్.
కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ మూడు నెలల గ్యాప్ తర్వాత స్టార్ట్ అయ్యింది.
“కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను కాస్త పరిస్థితులు కుదుటపడుటుండటంతో రీస్టార్ట్ చేశాం. హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభమైంది. సెట్స్‌లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలతో షూటింగ్ చేస్తున్నాం. వెంకటేష్ , వరుణ్‌తేజ్, సునీల్ సహా ప్రధాన తారలపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. డైరెక్టర్ అనీల్ రావిపూడి ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిస్తున్నారు. మా బ్యానర్‌లో మరో నవ్వుల రైడ్ కన్‌ఫర్మ్’’ అన్నారు నిర్మాత దిల్ రాజు.