
పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్టయింది. ఈ సినిమా బన్నీకి ఏ మేరకు కలిసొస్తుంది, దర్శకుడు సుకుమార్ కు పాన్ ఇండియా లెవెల్లో ఎంత క్రేజ్ తెస్తుందనేది భవిష్యత్తులో తేలుతుంది. అయితే ఈ సినిమా సక్సెస్ ను వెంటనే క్యాష్ చేసుకున్న నటుడు ఎవరైనా ఉన్నారంటే అది సునీల్ మాత్రమే.
“పుష్ప తర్వాత వేరే భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తమిళ్, హిందీ నుంచి ఎక్కువగా వస్తున్నాయి. తమిళ్ లో ఆల్రెడీ 2 ప్రాజెక్టులు ఓకే చేశారు. ఆ రెండు సినిమాల్లో విలన్ పాత్రలే. హిందీ నుంచి కూడా 2 ప్రాజెక్టులొచ్చాయి. అందులో ఒకటి విలన్ పాత్ర. ఇంకో సినిమాలో కమెడియన్ పాత్ర. సినిమా మొత్తం హీరో పక్కన ఉంటాను. త్వరలోనే వాటి ప్రకటనలు వస్తాయి.”

ఇలా పరభాషల నుంచి ఆఫర్లు వస్తున్న విషయాన్ని బయటపెట్టాడు సునీల్. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు రావడానికి పుష్ప సినిమానే కారణమని ప్రకటించాడు ఈ నటుడు.
ప్రస్తుతం ఈ నటుడు ఎఫ్-3 సినిమా రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. పుష్ప సినిమా ఎలాగైతే తన కెరీర్ ను మలుపుతిప్పిందో, ఎఫ్-3 సినిమా కూడా తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని భావిస్తున్నాడు ఈ నటుడు.