రజినీకాంత్ జైలులో సునీల్ ఇలా!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘జైలర్’ అనే సినిమా రూపొందుతోంది. ఒక జైలు అధికారిగా రజినీకాంత్ నటించే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ‘బీస్ట్’, ‘వరుణ్ డాక్టర్’ వంటి సినిమాలు తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి డైరెక్టర్.

ఐతే, పాన్ ఇండియా మార్కెట్ కోసం ఇప్పుడు వివిధ భాషల నుంచి ఒక్కో యాక్టర్ ని తీసుకొని సినిమాలు తీయడం ఒక పద్దతిగా మారింది ఇప్పుడు. మలయాళ లెజండరీ యాక్టర్ మోహన్ లాల్ ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. ఇక తెలుగు నుంచి సునీల్ ని ఒక కీలక పాత్రకి తీసుకున్నారు.

సునీల్ ఈ సినిమా షూటింగ్ లో చేరాడు. ఆ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్షర్స్ పై ఫోటో విడుదల చేయడం ద్వారా ప్రకటించింది. సునీల్ ఇలాంటి లుక్ లో కనిపిస్తాడు. సునీల్ నెగెటివ్ పాత్ర పోషిస్తున్నాడు అని అర్థం అవుతోంది.

సునీల్ కొంతకాలంగా విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. ‘పుష్ప’, ‘కలర్ ఫోటో’ వంటి చిత్రాల్లో సునీల్ చేసిన నెగెటివ్ రోల్స్ కి మంచి పేరు వచ్చింది.

 

More

Related Stories