
సెలెబ్రటీల ప్రెగ్నన్సీ వ్యహారాలు కూడా ఈ మధ్య హెడ్ లైన్స్ గా మారుతున్నాయి. మొన్నామధ్య ఓ యాంకర్ పుల్లని మామిడికాయ పట్టుకొని కనిపిస్తే ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు అల్లేశారు. “మీకో దండంరా నాయన” అంటూ అలాంటి ప్రచారాలు లేపొద్దు అని వేడుకోంది ఆ యాంకరమ్మ. అచ్చంగా అలాగే మాట్లాడుతోంది గాయని సునీత.
సునీత ఇటీవలే రెండో పెళ్లి చేసుకొంది. ‘మ్యాంగో’ అనే యూట్యూబ్ ఛానెల్ తో పేరొందిన డిజిటల్ మీడియా వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని ఆమె పెళ్లాడింది. ఇద్దరికీ రెండో పెళ్లే. 50 ఏళ్ల రామ్, 43 ఏళ్ల సునీత పేరెంట్స్ కాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయట. దాంతో, సునీత వీటిపై స్పందించింది.
“దేవుడా… వీళ్లు క్రేజీగా ఉన్నారు. మామిడితోటలో తొలి పంట చూపిస్తూ ఫోటో దిగితే… ఇదిగో ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. ఏవేవో ఊహించుకోవడం మానండి. పుకార్లు పుట్టించకండి. దండం రా నాయన!,” అని ఆమె పోస్ట్ చేశారు.
సునీతకి చాలా చిన్న వయసులోనే కిరణ్ అనే వ్యక్తితో పెళ్లి అయింది. వారికి ఇద్దరు పిల్లలు. ఆమె పిల్లలు ఇద్దరూ చదువులు కూడా పూర్తి చేసుకున్నారు. కెరీర్ లో సెటిల్ అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆమె మూడోసారి తల్లి కాబోతుందా అంటూ థంబ్ నెయిల్స్ తోసి యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లు వార్తలు మొదలుపెట్టాయి.
సునీత ఈ విధంగా క్లారిటీ ఇచ్చింది.