ఇక హనీమూన్ ప్లాన్ చేస్తున్నారట

Sunitha

సింగర్ సునీత, రామ్ పెళ్లి ఘనంగా జరిగింది. రాములోరి గుళ్లో వీరి వివాహ వేడుకని నిర్వహించారు. వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. తన కొడుకు, కూతురుని ఒప్పించి, పెద్దవాళ్ల ఆశీర్వాదాలతో రెండో పెళ్లి చేసుకున్న సునీత మోడ్రన్ మహిళగా అని అభినందించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ట్రోల్ చేసిన వారు కూడా ఉన్నారు.

ఐతే, ఇవన్నీ పట్టించుకోకుండా లైఫ్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది ఈ జంట. త్వరలోనే హనీమూన్ కి వెళ్లారట. రెండో పెళ్ళికి హనీమూన్ ఏంటి అని కామెంట్స్ వస్తాయని తెలుసు కానీ మాకు కూడా ప్రైవసీ కావాలి కదా అంటోంది ఈ జంట.

Also Check: Sunitha’s wedding album

కొవిడ్ కారణంగా పెళ్ళికి ఎక్కువ మందిని పిలవలేకపోయామని, త్వరలోనే ఇంట్లో ఫ్రెండ్స్ కి, ఇండస్ట్రీ వారికి విడతలవారీగా పార్టీ ఇస్తామని చెప్తోంది 43 ఏళ్ల సునీత.

మరోవైపు, సునీతని పెళ్లి చేసుకోవడం ద్వారా రామ్ వీరపనేనికి కూడా ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. మూవీ ఇండస్ట్రీలో హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు, జర్నలిస్టులకు రామ్ సుపరిచితమే. ఇప్పుడు కామన్ పబ్లిక్ కూడా పరిచయం అయ్యారు.

More

Related Stories