ఇక రోజూ అరగంట వస్తా: సునీత

Sunitha


కరోనా సెకండ్ వేవ్ తో అంతటా విషాద వార్తలే. ప్రతి ఊరిలో, ప్రతి నగరంలో, ప్రతి వాడలో కేసులే కేసులు. చనిపోతున్న వారి సంఖ్య కూడా అధికమే. ఇలాంటి బాధాకరమైన టైంలో జనాలకు కొంత సాంత్వన కావాలి. అందుకే తనవంతు ప్రయత్నంగా తన అభిమానులకు రిలీఫ్ చేకూరేలా ఇకపై ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి పాటలు పాడుతాను అని అంటున్నారు గాయని సునీత.

“ప్రతి దినం ఒక అరగంట అయినా లైవ్ లోకి వచ్చి మీరు కోరే పాటలు పాడుతాను,” అని సునీత తన అభిమానులకు ప్రామిస్ చేశారు.

సునీత ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్నారు. లైఫ్ లో ఆనందంగా ఉన్నారు. ఇకపై చారిటీకి, సమాజానికి ఉపయోగపడే పనులపై ఆమె ఫోకస్ పెడుతున్నారు.

Advertisement
 

More

Related Stories