
కరోనా బారిన పడిన టాలీవుడ్ సింగర్ సునీత, ప్రస్తుతం ఆ వైరస్ నుంచి కోలుకున్నట్టు తెలిపారు. ఎందుకైనా మంచిదని పరీక్షలు చేయించుకుంటే కరోనా ఉన్నట్టు తేలిందని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లి.. కరోనా నుంచి బయటపడ్డానని తెలిపారు.
“ఓ షూటింగ్ కు వెళ్లాను. తలనొప్పి వచ్చింది. కానీ నిర్లక్ష్యం చేయకుండా టెస్ట్ చేయించుకున్నాను. దురదృష్టవశాత్తూ కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ప్రస్తుతం నేను పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని, హోమ్ ఐసోలేషన్ లో ఉండి ఇప్పుడు హ్యాపీగా బయటకొచ్చేశాను.”
Also Read: Singer Sunitha and Malavika test corona positive
నిజానికి తలనొప్పి లాంటి చిన్న చిన్న లక్షణాల్ని రొటీన్ లైఫ్ లో పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. కానీ వయసులో పెద్దవారైన తన తల్లిదండ్రుల్ని దృష్టిలో పెట్టుకొని కరోనా పరీక్ష చేయించుకున్నట్టు సునీత తెలిపింది. ప్రస్తుతం తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు స్పష్టంచేసింది.