
శృంగార తార సన్నీ లియోన్ ని అరెస్ట్ చెయ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ టాపిక్ సాగుతోంది. బీజేపీ నాయకులది కూడా అదే మాట. సన్నీ లియోన్ నటించిన ఒక పాట గురించే ఈ గొడవ అంతా. అయినా సన్నీ లియోన్ పట్టించుకోవడం లేదు. పైగా ‘మచిలీ’ అంటూ ఇంకో పాట విడుదల చేస్తోంది ఈ అందాల సుందరి.
సన్నీ లియోన్ నటించిన “మధుబన్ మే రాధ” అనే పాట బాగా వైరల్ అయింది. ఇది శ్రీకృష్ణుడి కోసం రాధ పాడే భక్తి గీతం. 1960లో విడుదలైన కోహినూర్ అనే సినిమాలో మహ్మద్ రఫీ పాడిన ఆ పాటని లేటెస్ట్ గా రీమిక్స్ చేశారు. ఈ రీమిక్స్ గీతంలో సన్నీ లియోన్ నర్తించింది.
ఆమె డ్యాన్సులు, ఆమె హొయలు అసభ్యంగా ఉన్నాయని, హిందువుల మనోభావాలు ఈ పాట దెబ్బతీసిందని బీజేపీ నేతలు అంటున్నారు. హిందూ సంఘాలు కూడా ఈ పాటని యూట్యూబు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరికొందరు మరో అడుగు ముందుకేసి ఆమెని అరెస్ట్ చెయ్యాలని అడగడం విశేషం.
ఐతే, సన్నీ ఈ గొడవని పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఈ రోజు ఉదయం ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో మరో కొత్త పాట ‘మచిలీ’ విడుదల చేస్తున్నట్లు తెలిపింది.