పారిపోయి వచ్చిన భామకి ఆఫర్లు!

నయనతార కూడా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించింది అన్న విషయం తెలుసా? ఆ సినిమా అనేక కష్టాలు పడి విడుదల అయి… ఫ్లాప్ అయింది. హిందీలో హిట్టయిన “కహాని” సినిమాకి రీమేక్ గా రూపొందింది “అనామిక”. అదే పేరుతో ఇప్పుడు సన్నీ లియోన్ ఒక వెబ్ సిరీస్ చేస్తోంది.

హిందీలో రూపొందే ఈ వెబ్ సిరీస్ లో ఈ శృంగార తార “యాక్షన్” చేస్తోందట. అంటే.. ఫైట్స్ అన్నమాట. అందచందాల ఒలకబోయడం ఉండదు.

కరోనా ఇండియాలో పీక్ లో ఉన్న టైం సన్నీ లియోన్ ముంబై నుంచి అమెరికా పారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వచ్చి సినిమాలు, వెబ్ సిరీస్లు నటిస్తోంది. అప్పుడు పారిపోయి ఇప్పుడు ఈ ముఖం పెట్టుకొని ఇప్పుడు సినిమాలు సైన్ చేస్తున్నావు అంటూ ఆమెని సోషల్ మీడియా జనాలు ట్రోల్ చేస్తున్నారు. “నా పిల్లల క్షేమం కోసం ఆ నిర్ణయం తీసుకున్నా” అని ఇంతకుముందు చెప్పింది.

సన్నీ లియోన్ ముగ్గురు పిల్లలను అడాప్ట్ చేసుకొంది.

More

Related Stories