మాటల్లేవు అంటున్న సన్నీ

సన్నీ లియన్ కి తెలుగు చిత్రాలు కొత్త కాదు. ఆమె మనకి కొత్త కాదు. చాలా గ్యాప్ తర్వాత ఆమె చేసిన తెలుగు చిత్రం… ‘జిన్నా’. మంచు విష్ణు హీరో.

“నేను తెలుగులో ఇంతకుముందు నటించాను. కానీ తెలుగులో పూర్తి స్థాయిలో న‌టిస్తున్న మొదటి చిత్రం మాత్రం జిన్నా. లాక్ డౌన్ టైమ్ లో నాకీ కథ చెప్పారు. ఇది సైకాలజికల్ థ్రిల్లర్. ఇలాంటి కథలు అంటే నాకు చాలా ఇష్టం. కథ నచ్చి సినిమా చేస్తున్నాను,” అని సన్నీ చెప్పింది.

సన్నీ లియోన్ అందాలు ఆరబోయడం తప్ప నటించేది ఏమి ఉంటుంది అనుకోవద్దు. ఆమె ఇందులో మూగ అమ్మాయి పాత్ర పోషిస్తుండడం విశేషం. “రేణుక అనే మాటలు రాణి అమ్మాయి పాత్రలో నటిస్తున్నాను. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “జిన్నా” చిత్రం మాత్రం అందరికీ నచుతుంది,” అని చెప్పింది.

ఇక తన గురించి జరిగే ట్రోలింగ్, కామెంట్స్ పట్టించుకోను అంటోంది. సోషల్ మీడియాలో కామెంట్స్ ని పెద్దగా చదవదట. నటిగా వైవిధ్యం చూపాలనే ఉద్దేశంతో పూర్తిగా డి గ్లామర్ రోల్ లో కూడా నటిస్తోందిట ఒక చిత్రంలో.

Advertisement
 

More

Related Stories