హైదరాబాద్ ఐకియాలో రజినీకాంత్

Annaaatthe

ఇండియాలోనే మొట్టమొదటి ఐకియా స్టోర్ హైదరాబాద్లో ఏర్పాటు అయింది. చాలా పెద్ద షో రూమ్ ఇది. ఈ షోరూంకి సూపర్ స్టార్ రజినీకాంత్ విచ్చేయడం విశేషం. ఐతే, ఆయన షాపింగ్ కోసం రాలేదు. షూటింగ్ కోసమే వచ్చారు.

రజినీకాంత్ హీరోగా దర్శకుడు శివ తీస్తున్న మూవీ ‘అన్నాథే’ సినిమా షూటింగ్ గత రెండువారాలుగా హైదరాబాద్ లో కొనసాగుతోంది. బుధవారం రజినీకాంత్, నయనతారపై కొన్ని కీలక సీన్లు ఈ షోరూంలో చిత్రీకరించారు.

కరోనా సెకండ్ వేవ్ టైంలో పెద్ద సినిమాలు దాదాపుగా షూటింగులన్నీ రద్దు చేసుకున్నాయి. కానీ తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు రజినీకాంత్ హైదరాబాద్ లోనే షూటింగ్ కంటిన్యూ చెయ్యాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.

More

Related Stories