కాంగ్రెస్ ని మించిన బీజేపీ

Rajinikanth

రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేసే పార్టీగా అప్రతిష్ట తెచ్చుకున్న పార్టీ… కాంగ్రెస్. ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో జిమ్మిక్కులు చేసింది కాంగ్రెస్. ఆ పార్టీ చేష్టలు చూసి బీజేపీని ఎన్నుకున్నారు ప్రజలు. అందుకే ఈ రోజు దీనస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఐతే, ఇప్పుడు కాంగ్రెస్ నయం అనిపించేలా చేస్తోంది బీజేపీ. ఒకప్పుడు ‘విలువలున్న పార్టీ’గా పేరొందిన ఆ పార్టీ పూర్తిగా ఎన్నికల స్టంట్ పార్టీగా మారిపోయింది. ఎలెక్షన్స్ కోసం ఎన్ని అబద్దాలు ఆడాలో, ఎన్ని చీప్ ట్రిక్స్ చెయ్యాలో అవన్నీ చేస్తోంది బీజేపీ. ఈ విషయంలో కాంగ్రెస్ బెటర్ అని జనాలకు అర్థమయ్యేలా సక్సెస్ అయ్యారు ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా.

మొన్న జాతీయ ఫిలిం అవార్డుల ప్రకటనల్లోనే బీజేపీ మార్కు కనపడింది.

ఇప్పుడు రజనీకాంత్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన కూడా ఎన్నికల కోణంలోనే చూడాల్సి వస్తోంది. వందల చిత్రాల్లో నటించిన రజినీకాంత్ ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హులే. కాకపొతే, సరిగ్గా తమిళనాడు ఎన్నికల వేళ ఈ అవార్డును ప్రకటించడం అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు.

సూపర్ స్టార్ కృష్ణ, కమల్ హాసన్ వంటి ఇంకా గొప్ప అర్హతలున్న సినిమా సెలెబ్రిటీస్ కూడా ఉన్నారు. కానీ సరిగ్గా ఎన్నికల వేళ రజినీకాంత్ కి అవార్డును ప్రకటించడం వెనుకున్న మతలబు అర్థం చేసుకోలేమా?

Advertisement
 

More

Related Stories