సురేఖావాణి రెండో పెళ్లి, అసలు మేటరిదే!

Surekha Vani

నటి సురేఖావాణి ఇటీవలే 40వ పుట్టిన రోజు జరుపుకున్నారు. పోయినేడాది ఆమె భర్త చనిపోయారు. ఇప్పుడు ఆమె సింగల్. ఆమెకి 20 ఏళ్ల కూతురుంది. ఐతే, ఇప్పుడే ఎక్కువ అందంగా ఉన్నావని ఆమెకి మగాళ్లు కాంప్లిమెంట్ ఇస్తున్నారట. పెళ్లి చేసుకుంటామని చాలా మంది మగవాళ్ళు, సినిమా ఇండస్ట్రీ బ్యాచ్ ప్రొపోజల్స్ పెడుతున్నారట.

మరి, రెండో పెళ్ళికి సురేఖవాణి రెడీ అయినట్లేనా? “అలాంటిదేమి లేదు. అడిగే వాళ్ళకి తక్కువేమి లేదు అనుకొండి,” అని చెప్తోంది.

ఒకవేళ, రెండో పెళ్లి చేసుకుంటే… కాబోయే వాడు బాగా డబ్బున్న వాడు కావాలని కుండబద్దలు కొడుతోంది. “లైఫ్ లో అన్ని చూసేశాం కదా, డబ్బున్న వాడయితే బెటర్.” అంటూ ఫ్రాంక్ గా సమాధానమిచ్చింది.

More

Related Stories