గుండుతో సురేఖావాణి దర్శనం

Surekhavani

గ్లామరస్ నటిగా పేరొందిన సురేఖావాణి ఇలా గుండుతో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదివారం ఆమె ఇలా తిరుమలలో దర్శనమిచ్చింది.

సురేఖావాణి సినిమాల్లో అక్క,చెల్లి, వదిన వంటి పాత్రలతో బాగా పాపులర్ అయ్యారు. ఇక రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఇంకా ఎక్కువ పాపులారిటీ పొందారు. ఆమె కూతురు కూడా ఈ రీల్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు.

ఐతే, ఆమె తాజాగా తిరుమలకు కాలి నడకన చేరుకొని ఆ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అంతకుముందు తలనీలాలు సమర్పించారు. క్యూలో ఆమె గుండుతో కనిపించడంతో చాలామంది ఆమెతో సెల్ఫీలు దిగారు.

ఇటీవలే “భక్త కన్నప్ప” సినిమా షూటింగ్ లో పాల్గొని వచ్చిన సురేఖకి ఇప్పట్లో మరో సినిమాలో ఆఫర్ లేనట్లు ఉంది. లేదంటే తన జుట్టుని వదులుకునేది కాదు.

Advertisement
 

More

Related Stories