
కొంతకాలం క్రితం వరకు తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేస్తాను అని చెప్పింది సురేఖ వాణి. ఆ మేరకు కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకుంది అని టాక్.
సురేఖ వాని కూతురు సుప్రీతకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా స్టార్ అవడంతో ఇక సినిమాలు, టీవీలో యాంకరింగ్ లు వంటివి వద్దని నిర్ణయించుకుందట సుప్రీత.
సురేఖవాణి కూతురు ఇన్ స్టాగ్రామ్ ద్వారా, రీల్స్ ద్వారా బాగానే సంపాదిస్తోంది. సినిమాల్లో హీరోయిన్ గా చెయ్యాలంటే చాలా కష్టపడాలి. సక్సెస్ వస్తుందో లేదు చెప్పలేం. సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులార్టీ చాలు అని అనుకుంటున్నారట.
దానికి తోడు, సురేఖవాణి, ఆమె కూతురు జీవనశైలి డిఫరెంట్. జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలని అనుకునే ఫిలాసఫి వారిది. అందుకే, బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చినా తల్లీకూతుళ్లు ఇద్దరూ వదులుకున్నారు. స్వేచ్ఛగా ఉండాలని భావిస్తారు వాళ్ళు.

సో, సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వదు అన్నమాట. సుప్రీత అసలు పేరు బండారు సుప్రీత నాయుడు. సో, ఈ భామ సోషల్ మీడియా స్టార్ గానే హల్ చల్ చేస్తుంది.
ALSO CHECK: Surekha Vani’s Saree moments