
సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీతకి ఇన్ స్టాగ్రామ్ లో చాలా ఫాలోయింగ్ ఉంది. ఆమె కూతురుతో కలిసి రకరకాల వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ఇద్దరూ పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు.
అలాగే, నిన్న సుప్రీత పుట్టిన రోజును పురస్కరించుకొని ఇద్దరూ హై తై స్లిట్ ((High Thigh Slit Dress) డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేశారు. ఆ వీడియో ని పోస్ట్ చేశారు. వీరి చిందులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.కూతురితో ఆ డ్యాన్సులు ఏంటి, ఆ డ్రెస్సులు ఏంటి అని కొందరు కామెంట్స్ చేస్తున్నా సురేఖావాణి పట్టించుకోవడం లేదు. ‘నీతి సూత్రాలు కట్టిపెట్టోయ్’ అన్నట్లుగా బిందాస్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు తల్లీకూతుళ్లు.
అన్నట్లు, 40 ప్లస్ సురేఖావాణి బిగ్ బాస్ 5వ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టనుంది అని ప్రచారం జరుగుతోంది. కానీ ఆమె ఈ వార్తలపై స్పందించడం లేదు. గత ఏడాది కూడా ఆమె బిగ్ బాస్ కి వెళ్తుంది అని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారం నిజం కాలేదు. మరి ఈ సారి ప్రచారం నిజం అవుతుందా అన్నది చూడాలి.
ALSO CHECK: Surekha Vani flaunts her Saree avatar
సుప్రీతని కూడా కంటెస్టెంట్ గా రావాలని బిగ్ బాస్ టీం కోరింది కానీ ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆమెకి హీరోయిన్ గా మారే ఆలోచనలు ఉన్నాయి.