
నటి సురేఖ వాణి ఇటీవల తిరుపతి వెంకటేశుడికి తలనీలాలు అర్పించి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం గుండుతోనే ఆమె బయటికి వస్తున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు అదే అవతారంలో పోస్ట్ చేస్తున్నారు. ఆమె సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ పాపులర్ అయింది అనడంలో సందేహం లేదు.
ఆమె, ఆమె కూతురు సుప్రీతతో కలిసి పొట్టి పొట్టి డ్రెస్సులతో చేసే డ్యాన్సులు, ఆ రీల్స్ బాగా పాపులర్. ఆమె కూతురు కూడా సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. కూతుర్ని హీరోయిన్ గా పరిచయం చేయాలన్న ఆలోచనతో ఆమె చాలా కాలంగా ఉంది. ఇన్నాళ్లకు అది సెట్ అయినట్లు టాక్.
తాజా సమాచారం ప్రకారం “బిగ్ బాస్” ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటిస్తున్న ఒక కొత్త చిత్రంలో సుప్రీత హీరోయిన్ గా నటిస్తోంది. మహేంద్రనాథ్ కొండ్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. గురువారం నాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది ఈ సినిమా.
“దర్శక నిర్మాతల మీద నమ్మకంతోనే నా బిడ్డను వాళ్ల చేతుల్లో పెట్టాను. అందుకే ఈ చిత్రానికి ఒప్పుకున్నాను,” అని అన్నారు సురేఖ

సుప్రీతకి ఇన్ స్టాగ్రామ్ లో క్రేజ్ ఎక్కువ. ఈ భామకి ఇన్ స్టాలో 8 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆమె మొదటి చిత్రానికి మంచి క్రేజ్ వస్తుంది అనుకోవచ్చు.