కిక్ ఇవ్వబోతున్న అఖిల్?

ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మేరకు ప్రాజెక్టు లాక్ అయింది. సురేందర్ రెడ్డి నెరేషన్ ను అఖిల్ తో పాటు నాగార్జున కూడా విని ఓకే చేశాడు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమా “కిక్” షేడ్స్ లో ఉండబోతోంది. ఇప్పటివరకు ఎవ్వరూ చూడని మోస్ట్ ఎనర్జిటిక్ లుక్, బాడీ లాంగ్వేజ్ లో అఖిల్ ను చూపించడానికి రెడీ అవుతున్నాడు సురేందర్ రెడ్డి. అంతేకాదు, ఈ సినిమాలో అఖిల్ ఓ రేంజ్ లో కామెడీ కూడా పండించబోతున్నాడు.

చిరంజీవితో చేసిన “సైరా” లాంటి పెద్ద సినిమా తర్వాత సురేందర్ రెడ్డి, ఇలా అఖిల్ లాంటి హీరోను సెలక్ట్ చేసుకోవడం కాస్త విచిత్రంగానే అనిపించినప్పటికీ.. తన ప్రాజెక్టుకు అక్కినేని హీరోనే కరెక్ట్ అంటున్నాడు సురేందర్ రెడ్డి.

సురేందర్ రెడ్డి ఇంతకుముందు అల్లు అర్జున్ తో మూవీ అనుకున్నాడు. కానీ అది ఆలస్యం అయ్యేలా ఉండడంతో వరుణ్ తేజ్, ఆ తర్వాత రామ్ తో మూవీస్ ప్లాన్ చేశాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా అఖిల్ తో సెట్ అయిందన్నమాట. ఐతే …ఇది కూడా ఆఫీసియల్ ప్రకటన వస్తే గానీ చెప్పలేం.

Related Stories