సురేష్ బాబు కాంబో ప్యాక్

Suresh Babu

లాక్ డౌన్ టైమ్ లో అందరు నిర్మాతల్లానే సురేష్ బాబు కూడా నష్టాలు చవిచూశారు. ఆయన నిర్మిస్తున్న ”విరాటపర్వం”, ”నారప్ప” సినిమాల షూటింగ్స్ ఆగిపోవడంతో పాటు.. కీలకమైన థియేటర్ బిజినెస్ కూడా నిలిచిపోవడంతో ఆయన భారీగా నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తన నష్టాల నుంచి బయటపడేందుకు ఆయన ఓ కాంబో ప్యాక్ సిద్ధం చేశారు.

ప్రస్తుతం తన చేతిలో ఉన్న ‘నారప్ప’, ‘విరాటపర్వం’ సినిమాల్ని కాంబో ప్యాక్ కింద శాటిలైట్ రైట్స్ సేల్ చేసే ఆలోచనలో ఉన్నారట సురేష్ బాబు.

‘నారప్ప’ సినిమాను కళైపులి ఎస్.థానుతో కలిసి నిర్మిస్తున్నారు. ఇక ‘విరాపటర్వం’ సినిమాను సుధాకర్ చెరుకూరితో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పుడీ రెండు సినిమాల శాటిరైట్ రైట్స్ ను ఏదో ఒక ఛానెల్ కు జాయింట్ గా ఇచ్చేసే ఆలోచన చేస్తున్నారట. కుదిరితే త్వరలోనే రాజ్ తరుణ్ తో చేయబోయే ‘డ్రీమ్ గర్ల్’ రీమేక్ శాటిలైట్ రైట్స్ ను కూడా కలిపి ఇచ్చేయడానికి రెడీ అవుతున్నారట.

బయట నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమాలు నిర్మించే వ్యక్తి కాదు సురేష్ బాబు. కుదిరితే ఆయనే ఇతర నిర్మాతలకు ఫైనాన్స్ చేసేంత సౌండ్ పార్టీ. కాబట్టి ఆయనకు వడ్డీల సమస్య ఉండదు. మరి ఆయన తన రెండు సినిమాల్ని ఇలా బల్క్ గా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో?

Related Stories