స్టార్స్ మా ఇళ్ల నుంచి పుట్టరు

Suresh Babu

రామానాయుడు అండతో వెంకటేష్ హీరోగా మారారు. ఇక సురేష్ బాబు, వెంకటేష్ అండతో రానా హీరోగా మారాడు. త్వరలోనే వీళ్లందరి అండతో అభిరామ్ కూడా హీరోగా మారబోతున్నాడు. భవిష్యత్తులో వెంకటేశ్ కొడుకు అర్జున్ హీరోగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

నెపొటిజంకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ కుటుంబం నుంచి నెపొటిజంపై ఎలాంటి స్పందన వస్తుందనేది అందరికీ ఆసక్తికరమే. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. నెపొటిజంపై సురేష్ బాబు స్పందించారు.

“తెలిసిన వాళ్ల పిల్లలకైనా, మన పిల్లలకైనా, ఎవరికైనా మొదట్లో కొంచెం పుష్‌ ఇస్తాం కానీ, వాడిని హీరోగా ఒప్పుకోవలసింది, స్క్రీన్‌ మీద చూసేది ప్రేక్షకులే. అందుకే నెపోటిజమ్‌ ను నేను సమర్థించను, అలా అని విమర్శించను. కారణం ఏంటంటే ఎంతోమంది దర్శకుల, నిర్మాతల, హీరోల పిల్లలు ఈ ఇండస్ట్రీలోకి వచ్చి నిరూపించుకోలేకపోయారు. స్టార్స్‌ ఇళ్లల్లో నుండి పుట్టరు, ఆడియన్స్‌ ఆమోదంతో స్టార్స్‌ అవుతారు.”

ఇలా నెపొటిజం/బంధుప్రీతిపై తనదైన శైలిలో స్పందించారు సురేష్ బాబు. ఓవైపు రామ్ చరణ్, బన్నీ, రానా లాంటి హీరోలు ఉన్నప్పటికీ.. మరోవైపు రవితేజ, నాని, రాజ్ తరుణ్ లాంటి హీరోలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగారని చెప్పుకొచ్చారు సురేష్ బాబు.

Related Stories