- Advertisement -

హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక కూడా మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ రోజు వారు వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపారు. 45 ఏళ్ల సూర్య చాలా ఆలస్యంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి కారణం ఆయన మూడు నెలల క్రితం కరోనా బారిన పడ్డారు. అందుకే ఇంత ఆలస్యం అయింది.
సూర్య ప్రస్తుతం పాండిరాజ్ అనే దర్శకుడు తీస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా భారీ ఎత్తున రూపొందుతోంది. ఇక తెలుగులో కూడా త్వరలోనే ఒక సినిమా చేసేందుకు సూర్య రెడీ అవుతున్నాడు. బోయపాటి, త్రివిక్రమ్ వంటి దర్శకులతో చర్చలు జరుగుతున్నాయి.
సూర్యకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది.