
బీహార్ ఎన్నికల్లో లబ్ది కోసమో, మరి దేనికోసమో తెలీదు కానీ సుశాంత్ సింగ్ మరణాన్ని పొలిటికల్ గిమ్మిక్ గా మార్చారు అనేది కాదనలేని సత్యం. ఐతే, సుశాంత్ సింగ్ మరణం కేసు చివరికి డ్రగ్స్ కేసుగా మారి… సుశాంత్ డ్రగ్ అడిక్ట్ అన్న విషయం రూఢి కావడం, రియా మీద చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడ నిరూపితం అయ్యే అవకాశం లేకపోవడంతో మెల్లగా దాన్ని పక్కన పెట్టారు.
ఇప్పుడు మొత్తంగా సైడ్ అయిపోయింది ఈ కేసు. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చర్చ తగ్గింది. మరో నెల రోజుల్లో జనం కూడా మర్చిపోతారు. సో… సుశాంత్ సింగ్ మరణం చుట్టూ ఒక మూడు నెలలు సాగిన హంగామా అంతా ఒక మీడియా, పొలిటికల్ డ్రామా అనే అనుకోవాల్సి వస్తోంది.
బెయిల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత రియా చక్రవర్తి కూడా స్పందించడం లేదు. మీడియాతో మాట్లాడలేదు. ఆమె తన లైఫ్ ని సెట్ చేసుకునే పనిలో ఉంది.