ఇంతకీ సాధించింది ఏంటి?

Sushant Singh and Rhea Chakraborty

సుశాంత్ సింగ్ మరణం బాధాకరం. కారణాలు ఏంటి అనేది సిబిఐ తన పరిశోధనలో చెప్పాలి. ఐతే, డ్రగ్స్ కేసులో రియాని అరెస్ట్ చేసి “జుస్టిక్ ఫర్ సుశాంత్” అంటూ హడావిడి చేస్తున్న గ్యాంగ్ సాధించింది ఏంటి?

దాదాపు మూడు నెలల మీడియా డ్రామా తర్వాత….. సుశాంత్ సింగ్ డ్రగ్ అడిక్ట్ అని అందరూ కలిసి ఎస్టాబ్లిష్ చేసినట్లు అయింది. పాపం.. జస్టిస్ ఫర్ సుశాంత్ అని చేసిన హంగామా అంతా దీనికోసమేనా? బతికున్నప్పుడు సుశాంత్ కి ఇలాంటి బాడ్ ఇమేజ్ లేదు. ఇప్పుడు అందరూ కలిసి అతను డ్రగ్స్ కి బానిస అని ప్రూవ్ చేశారు. రియాని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ బ్యూరో కూడా.. రియా తాను డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పలేదని స్పష్టం చేసింది. అంటే.. రియాకి డ్రగ్స్ బానిస కాదు. సుశాంత్ కోసం ఆమె డ్రగ్స్ తెప్పించేది అని నార్కోటిక్స్ తన రిమాండ్ లో రాసింది. అంటే, ఆఫిసియల్ గా సుశాంత్ ని ఒక జుంకీ అని ముద్ర వేశారు.

 ఒకేసారి ఈ కేసు మొదటి నుంచి చూద్దాం. 

– “సుశాంత్ సింగ్  ది ఆత్మహత్య కాదు, హత్య.”
– “సుశాంత్ సింగ్ ని బాలీవుడ్ పెద్దలు వేధించారు. నెపోటిజానికి సుశాంత్ బలి అయ్యాడు.”
– “సుశాంత్ మాజీ మేనేజర్ దిషాని చంపి, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. అందుకే ముంబై పోలీసులు ఒక పెద్ద నాయకుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ రహస్యం సుశాంత్ కి తెలుసు అందుకే… అతన్ని చంపి ఉంటారు.”
– “సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు మాయం అయ్యాయి. రియా బోగస్ కంపెనీలు క్రేయేట్ చేసి డబ్బు కాజేసింది.”
– “బాలీవుడ్ డ్రగ్ మాఫియా రహస్యాలు సుశాంత్ కి తెలుసు. రియాకి, ఆ డ్రగ్స్ ముఠాకి లింక్స్ ఉన్నాయి. సుశాంత్ ని విషం ఇచ్చి చంపారు.”

ఇలా ముందు ఎన్నో స్టేట్ మెంట్స్ ఇచ్చారు. దాంతో ఈడీ రంగంలోకి దిగింది. డబ్బులు రియా అక్కౌంట్ కి ట్రాన్స్ ఫర్ అయినట్లు ఈడీ కనుక్కోలేక పోయింది. సిబిఐ రియాని ప్రశ్నించింది. ఆ తర్వాత డ్రగ్స్ కోణం ఉందని నార్కోటిక్స్ బ్యూరోని రప్పించింది. ఈ బ్యూరో… రియా డ్రగ్స్ తీసుకునేది అని, ఆమె ఆల్రెడీ విచారణలో అంగీకరించింది అని ఒక రెండు ఇంగ్లీష్ ఛానెల్స్ ద్వారా లీకులు ఇచ్చింది.

కానీ తీరా రియాని అరెస్ట్ చేసిన రిమాండ్ రిపోర్ట్ లో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు లేవు. సుశాంత్ కోసం డ్రగ్స్ తెప్పించేది అని ఉంది. ఈ కేసు ఇంకా అయిపోలేదు ఈ కేసులో 14 రోజుల పాటు రియాకి రిమాండ్ విధించింది కోర్టు. విచారణలో ఇంకా ఏమైనా కొత్త కోణాలు రావొచ్చు. కానీ ఈ లోపు సుశాంత్ డ్రగ్స్ కి బానిస అని మాత్రం ఎస్టాబ్లిష్ చేశారు. 

కంగనా రనౌత్, రెండు ఇంగ్లీష్ ఛానెల్స్, కొందరు సోషల్ మీడియా వల్ల సుశాంత్ కేసు పొలిటికల్ యాంగిల్ తీసుకొంది… వారి పొలిటికల్ గేమ్ కి సుశాంత్ చనిపోయిన తర్వాత కూడా బలి అయ్యాడు.

Related Stories