మూడేళ్లు పూజలు చేస్తే పుట్టాడట

Sushant

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై ఆయన తండ్రి కేకే సింగ్ మరోసారి స్పందించారు. ఈసారి సుశాంత్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడాయన.

“సుశాంత్ మాకు వరం. ఎన్నో పూజలు, నోములు చేస్తే పుట్టాడు. మాకు నలుగురు అమ్మాయిలు పుట్టారు. అబ్బాయి కావాలని మూడేళ్ల పాటు ఎంతో నిష్టగా పూజలు చేశాం. ఆ పూజా ఫలితమే సుశాంత్.”

అలా ఎన్నో పూజల తర్వాత పుట్టిన ఒకే ఒక్క కొడుకు ఇలా అర్థాంతరంగా తనువు చాలించాడంటూ ఆయన తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మరోవైపు సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండేపై కూడా కేకే సింగ్ స్పందించారు. “ఆమెపై మాకు ఎలాంటి కోపం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ముంబైలో ఆమె మమ్మల్ని కలిసింది. పాట్నా కూడా వచ్చి మా కుటుంబాన్ని పరామర్శించింది. సుశాంత్ తో బ్రేకప్ ఎందుకు జరిగిందో మాకు వివరించింది.”

ఓ వ్యక్తి ఎదుగుతున్నాడంటే బాలీవుడ్ లో అణచివేయడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారని, గతంలో కూడా ఇలాంటి ఉదంతాలు జరిగాయని అంటున్నాడు కేకే సింగ్. సుశాంత్ విషయంలో కూడా అలాంటివి జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తంచేశాడు.

Related Stories