సుష్మిత గోల్డ్ డిగ్గర్ కాదు!

తమ కన్నా వయసులో చాలా పెద్దవాళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళని అనుమానంతో చూస్తారు. ముఖ్యంగా బాగా డబ్బున్న నడి వయసు లేదా ముసలి వాళ్ళతో సంబంధాలు పెట్టుకునే వారిని ‘గోల్డ్ డిగ్గర్’గా భావిస్తారు. మనీ కోసమే పెళ్లి/రొమాంటిక్ రిలేషన్ నడిపే వాళ్ళని ‘గోల్డ్ డిగ్గర్’ అని పిలుస్తారు ఇంగ్లీష్ లో. సుష్మిత సేన్ ని కూడా అందరూ గోల్డ్ డిగ్గర్ అని కామెంట్ చేస్తున్నారు.

వ్యాపారవేత్త లలిత్ మోదీ తాజాగా ఆమెతో డేటింగ్ లో ఉన్నట్లు ఇన్ స్టాగ్రామ్ లో రాసుకున్నాడు. త్వరలోనే ఆమెని పెళ్లాడబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమెని గోల్డ్ డిగ్గర్ గా పేర్కొంటూ సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్నారు ట్రోలర్స్.

దాంతో, ఆమె తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. “నాకు పరిచయం లేని వాళ్ళు, నా స్నేహితులమని చెప్పుకునేవాళ్ళు, మేధావులమని ఫోజు కొడుతున్న వారూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. నా జీవితం గురించి, నా వ్యక్తిత్వం గురించి పెద్ద ఉపన్యాసాలు పెడుతున్నారు. బంగారం కాదు ఇంకా లోతుగా డిగ్ (తవ్వడం ) చేస్తా. ఎందుకంటే వజ్రాలు దొరుకుతాయి. అవును, నేను ఎప్పుడూ వజ్రాలే ఇష్టపడతా. ఇప్పటికీ నా పైసలతో నేను కొనుక్కుంటా,” అని ఘాటుగా సమాధానం ఇచ్చింది.

Lalith Modi and Sushmita Sen

తాను ఎప్పుడూ ఇతరుల మెప్పుకోలుపై ఆధారపడి బతకలేదు అని అంటోంది సుష్మిత.

ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్, దర్శకుడు విక్రమ్ భట్ కూడా ఆమెని గోల్డ్ డిగ్గర్ గా అభివర్ణించడం అన్యాయం అంటున్నారు. ఆమె ఎప్పుడూ డబ్బుల కోసం ఎవరితో డేటింగ్ చెయ్యదు అని చెప్తున్నారు.

 

More

Related Stories