ట్రబుల్లో స్వాతి దీక్షిత్!

‘బిగ్ బాస్ తెలుగు 4’లోకి గ్లామర్ ఫేస్ గా అడుగుపెట్టింది స్వాతి దీక్షిత్. ఈ భామ గత వీకెండ్ వైల్డ్ ఎంట్రీ కార్డుతో బిగ్ బాస్ హౌసులోకి వచ్చింది, కానీ అప్పుడే ట్రబుల్లో పడింది. ఆమె ఓటింగులో వెనుకబడింది. దాంతో ఆమె అప్పుడే ఎలిమినేషన్ లోకి వచ్చింది. మరి ఈ భామ ఈ వీక్ వోటింగ్ పెంచుకుంటుందా? తన పర్ఫెర్మన్స్ తో అదరగొడుతుందా అనేది చూడాలి.

మరోవైపు గత వీకెండ్ ఎలిమినేట్ అయిన టీవీ దేవి… తన ఎలిమినేషన్ వెనుక పవన్ కళ్యాణ్ అభిమానులున్నారని అనుమానిస్తోంది. టీవీ9 కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతకాలంగా సోషల్ మీడియాలో నెగెటివ్ గా ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే… టీవీ9 ఇటీవల పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా న్యూస్ ప్రసారం చేసిందట.

అలా దేవికి వోటింగ్ లో తేడా వచ్చింది.

Related Stories