బిగ్ బాస్ లోకి ఈ బ్యూటీ!

త్వరలోనే ప్రారంభం కాబోతోంది బిగ్ బాస్ సీజన్-4. ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లోకి ఎవరు ఎంటరవ్వబోతున్నారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో  భాగంగా యాంకర్ అరియానా హౌజ్ లోకి వెళ్లబోతోందనే విషయాన్ని telugucinema.com ఇప్పటికే బ్రేక్ చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో బ్రేకింగ్.

బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఒకరు హీరోయిన్ స్వాతి దీక్షిత్. తెలుగులో ‘జంప్ జిలానీ’, ‘లేడీస్ అండ్ జెంటిల్ మేన్’, ‘చిత్రాంగద’ లాంటి సినిమాల్లో నటించింది స్వాతి దీక్షిత్. ఇప్పుడీ బ్యూటీ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లబోతోంది.

కేవలం బిగ్ బాస్ కోసమే తను ఆల్రెడీ కమిట్ అయిన కొన్ని ఓటీటీ ఆఫర్లను వదులుకుంది స్వాతి దీక్షిత్. అన్ని ఆఫర్లు పక్కనపెట్టి, షో నిబంధనల ప్రకారం సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది. మరికొన్ని రోజుల్లో ఆమె బిగ్ బాస్ సీజన్-4లో కనిపించబోతోంది.

Related Stories