స్వాతికి కూడా ఫ్యాన్స్ ఉన్నారట!

Swathi Deekshith

హీరోయిన్ స్వాతి దీక్షిత్ చేసిన సినిమాలు పేర్లు చెప్పమని అడిగితే….. ఒక్కరు కూడా గూగుల్ చెయ్యకుండా సమాధానం చెప్పలేరు. అలాంటి భామని బిగ్ బాస్ లోకి తీసుకోవడమే ఒక వింత. ఈ భామకి అభిమానులు ఉన్నారు అంటే ఆశ్చర్యం కలగదా? ఇంకా విచిత్రం ఏమంటే ఆమెని ఎలిమినేట్ చేసినందుకు ధర్నా చేస్తున్నారు ఈ “అభిమానులు”.

బిగ్ బాస్ 4 నుంచి ఇప్పటివరకు సూర్య కిరణ్, దేవి, కరాటే కళ్యాణితో పాటు స్వాతి దీక్షిత్ బయటికి వచ్చారు. కానీ… విచిత్రంగా స్వాతిని మళ్లీ బిగ్ బాస్ హౌసులోకి తీసుకోవాలంటూ “అభిమానులు” అని చెప్పుకుంటున్న కొందరు ప్లేకార్డులు పట్టుకొని అన్నపూర్ణ స్టుడియో వద్ద నిరసనకు దిగారు.

అన్నపూర్ణ సెవన్ ఎకర్స్ స్టూడియోలోనే బిగ్ బాస్ హౌస్ సెట్ ఉంది. అక్కడే షో జరుగుతోంది. దాంతో కొద్దిమంది “స్వాతి అభిమానులు” అక్కడ హంగామా చేశారు. ఇంతకీ ఈ “నిరసన” వెనుకున్నదెవరో.

అన్నట్లు గూగుల్ చేస్తే తేలింది ఏంటంటే… స్వాతి దీక్షిత్ “లేడీస్ అండ్ జెంటిల్మన్”, “జంప్ జిలాని” వంటి సినిమాల్లో నటించిందట. ఇంతకీ ఆ సినిమాలు ఎప్పుడు వచ్చాయని అడగకండి. అవి ఫ్లాఫ్ చిత్రాలు. అంతటి పాపులర్ హీరోయిన్ ఈ స్వాతి దీక్షిత్.

Related Stories