మరిన్ని సినిమాలు చేస్తా: స్వాతి

- Advertisement -

దాదాపు నాలుగేళ్ళ తర్వాత స్వాతి రెడ్డి కొత్త సినిమా ఒప్పుకొంది. కలర్స్ స్వాతి అసలు పేరు స్వాతి రెడ్డి. ఇప్పుడు సినిమాల్లో ఇదే పేరుతో నటిస్తోంది. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో ఒప్పుకున్న చిత్రం…’పంచతంత్రం’.

ఇకపై రెగ్యులర్ గా సినిమాలు చేస్తుందట. మధ్యలో చాలా గ్యాప్ తీసుకొంది. ఐతే, ఇప్పుడు ఆమెకి సినిమాలు అవసరం. ఖాళీగా ఉండడం బోర్ కొడుతోందట. హీరోయిన్ గానే కాదు ప్రత్యేక పాత్రలు కూడా చేస్తుందట. ఆమె తన మకాంని పూర్తిగా హైదరాబాద్ కి మార్చింది. సోషల్ మీడియాలో ఆక్టివిటీ తగ్గించింది.

Also Check: Colors Swathi makes comeback with Panchathantram

కెరీర్ చక్కదిద్దుకోవడం ఆమె తొలి ప్రాధాన్యం. వ్యక్తిగత జీవితంలో జరిగిన మార్పుల గురించి ఇప్పుడే మాట్లాడదంట. సమయం వచ్చినప్పుడు రివీల్ చేసే అవకాశం ఉంది.

 

More

Related Stories