‘మిస్టర్ ప్రెగ్నెంట్’గా సోహైల్

- Advertisement -
Mr Pregnant

‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ హీరోగా మారాడు. ఆయన నటిస్తున్న సినిమాకి గమ్మత్తైన పేరుని ఖరారు చేశారు. ఆ టైటిల్… ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. హీరో సోహైల్ ఇందులో ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నాడట. మగాడు ప్రెగ్నెంట్ అవడం ఏంటి? టైటిల్ తోనే ఆసక్తి రేపుతోంది ఈ మూవీ.

శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

సోహెల్ సరసన రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ తెలుగు అమ్మాయి సత్యదేవ్ హీరోగా రూపొందిన ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ సినిమాతో పేరు తెచ్చుకున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Mr Pregnant Title Glimpse | Syed Sohel Ryan | Srinivas Vinjanampati | Roopa Koduvayur | Appi Reddy
 

More

Related Stories