ఆ హీరో భార్యకి నేను నచ్చలేదు

Taapee Pannnu

తన కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను అంటోంది తాప్సి. పలు సినిమాల నుంచి ఆమెని తొలగించారు అని చెప్తోంది. ఇది సౌత్ లోనూ, బాలీవుడ్ లోనూ జరిగిందట.

తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉంది. నటిగా బాగా పేరు తెచ్చుకొంది. “ఒక సినిమా నుంచి నన్ను కొద్దీ రోజుల తర్వాత డ్రాప్ చేశారు. ఎందుకంటే ఆ హీరో భార్యకి నేను నచ్చలేదు. ఆమె నేను తన భర్త సరసన నటించొద్దు అనుకొంది,” అని లేటెస్ట్ ఇంటర్వ్యూ లో పేర్కొంది. ఇంతకీ ఎవరా హీరో? ఆ హీరో భార్యకి తాప్సి ఎందుకు నచ్చలేదు?

ఐతే, తాప్సి చెప్పేదంతా నిజం అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు బాలీవుడ్ లో మంచి సక్సెస్ వచ్చింది కాబట్టి ఏమి చెప్పినా నమ్మేస్తారని ఎదో ఒకటి చెపుతున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో ఆమె తెలుగు సినిమాల గురించి ఇలాగే బాడ్ గా కామెంట్ చేసింది. తర్వాత మాట మార్చింది.

Related Stories