
కొంతకాలంగా లవ్ లో ఉన్న హీరోలు, హీరోయిన్లు అందరూ ఈ కరోనా కాలంలో పెళ్లిపీటలెక్కారు. రానా తన గాళ్ ఫ్రెండ్ మిహీకని, నితిన్ తన లవర్ శాలినిని, నిఖిల్ సిద్దార్థ్ పల్లవి వర్మని, కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ ని పెళ్లాడారు ఈ ఏడాది. నిహారిక పెళ్లి ఈ నెల 9న. ఇక సింగర్ సునీత ఈ నెలాఖర్లో రెండ్ పెళ్లి చేసుకోనుంది.
సెలబ్రిటీలందరూ ఇలా కరోనా కారణంగా పెళ్లి మూడ్లోకి వచ్చారు. తాప్సికి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఆమె కొంతకాలంగా లవ్ లో ఉంది. మథియాస్ అనే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తో డేటింగ్ చేస్తోంది. ఇటీవలే అతనితో కలిసి మాల్దీవుల్లో వెకేషన్ కి వెళ్ళొచ్చింది. అక్కడే వీరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ ప్రచారంపై తాప్సి స్పందించింది. “పెళ్లి వార్తలు తప్పు. డేటింగ్ నిజం. అంతకన్నా ఏమి చెప్పను,” అని సూటిగా సుత్తిలేకుండా చెప్పింది.