హెల్మెట్ లేదని తాప్సికి ఫైన్

హీరోయిన్ తాప్సి హెల్మెట్ లేకుండా బుల్లెట్ బైక్ వేసుకొని షికారు చేసింది. హీరోయిన్ అయినా, ఎవరైనా మాకు ఒకటే అని ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. ఆమెని రోడ్ పైన ఆపి ఫైన్ వేశారు పోలీసులు. ఈ ఇన్సిడెంట్ ఈ రోజు జరిగింది.

ఐతే, విచిత్రం ఏంటంటే… ఆమె బైక్ నడిపింది ఒక సినిమా షూటింగ్ లో భాగంగా. “రష్మీ రాకెట్” అనే సినిమా షూటింగ్ కోసం ఆమె బైక్ వేసుకొని రోడ్ పై వెళ్ళింది. వెనకాల ఆమెని ఫాలో అవుతోంది కెమెరా యూనిట్. కానీ పోలీసులు అది గమనించకుండా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తోంది అని ఫైన్ వేశారని ఈ అమ్మడు చెప్తోంది. ఆమె ఆ ఫోటోని కూడా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

మరోవైపు, ఇటీవల తాప్సి చేసిన ఒక కామెంట్ బాగా వైరల్ అయింది. ఒక హీరో భార్య తనని ఒక సినిమా నుంచి తొలగించింది అన్న ఆమె ఇంటర్వ్యూ బాగా పేలింది. ఆ హీరో ఎవరు, ఆ హీరో భార్య ఎందుకు ఆలా చేసిందో చెప్పమంటూ తాప్సిని ట్విట్టర్లో అందరూ కొచ్చెన్నింగ్.

Also Read: ఆ హీరో భార్యకి నేను నచ్చలేదు

Related Stories