తాప్సి కూడా ఆ రూట్లోకి వచ్చింది!

తాప్సి అనగానే అద్భుతమైన యాక్టింగ్, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు గుర్తొస్తాయి. ఒకప్పుడు ఈ భామ తెలుగులో పూర్తిగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేసింది. ఐతే, బాలీవుడ్ లో మాత్రం కొత్త తరం కంగన అనిపించుకొంది. ఆమె చేసిన ‘పింక్’, ‘బదలా’,’ముల్క్’, ‘హసీనా దుల్రుబా’ ఇలాంటి చిత్రాలతో ఆమె నటిగా బాగా పేరు తెచ్చుకొంది.

ఐతే, తాప్సికి మొదట్లో విజయాలు బాగానే దక్కాయి. కానీ, ఆ తర్వాత అన్నీ ఫ్లాపులే. దాంతో, తాప్సి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఇప్పుడు క్రేజ్ తగ్గింది. దాంతో, ఇప్పుడు ఆమె సినిమాల కన్నా బాడీ మెంటైన్ చేసుకోవడంపై దృష్టి పెట్టింది.

తాజాగా ఈ భామ కూడా ఫ్లాట్ బెల్లీ అందాలు సంతరించుకొంది. నెలల తరబడి కష్టపడి, డైటింగ్ చేసి, జిమ్ కి వెళ్లి ఫ్లాట్ బెల్లి సంపాదించుకొంది. తన యాబ్స్ ని చూపిస్తూ ఒక ఫోటో షేర్ చేసింది.

తన బాడీ ఇప్పుడు సెక్సీగా తయారు కావడంతో బికినీ ఫోటోలు, వంపు సొంపులు కనపడే ఫోటోషూట్ పిక్చర్స్ షేర్ చేస్తోంది.

Advertisement
 

More

Related Stories