
ఒకప్పుడు హీరోయిన్లు తమ లవ్ అఫైర్ల గురించి ఓపెన్ గా మాట్లాడేవారు కాదు. కానీ నేటి తరం హీరోయిన్లు కొందరు తాము చాలా మందితో డేటింగ్ చేశామని కుండబద్దలు కొడుతారు. శృతి హాసన్, తాప్సిలది ఆ జాబితానే. శృతి హాసన్ తాను డేటింగ్ చేసిన ప్రతి బాయ్ ఫ్రెండ్ వివరాలను దాచిపెట్టలేదు. కానీ తాప్సి మాత్రం తన బాయ్ ఫ్రెండ్స్ మీడియా కంటపడకుండా వ్యవహరించింది.
లేటెస్ట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్స్ అందరూ బేవార్స్ గాళ్ళే అన్నట్లుగా మాట్లాడింది. మీరు ఎప్పుడైనా “యూజ్ లెస్” బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేశారా అని జర్నలిస్ట్ అడిగాడు. దానికి ఆమె “అబ్బో చాలామంది ఉన్నారు” అని సమాధానం ఇచ్చింది.
ఒకడు బేవార్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. అనేకమంది బేవార్సుగాళ్ళు తగిలారు అంటే… సమస్య నీలో ఉంది తాప్సి అంటూ ఆమెకి కామెంట్స్ పడుతున్నాయి సోషల్ మీడియాలో. “యూజ్ లెస్ అని తెలిసి అంత మందితో డేటింగ్ కి వెళ్ళావంటే మీకు సరియన జడ్జిమెంట్ లేదు అని అర్థం,” అని ఆమెని ట్రోల్ చేస్తున్నారు.
తాప్సి ప్రస్తుతం ఓటిటి సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన “లూప్ లపేట” ఈ శుక్రవారం (ఫిబ్రవరి 4) నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రొమోషన్ లో భాగంగా తన “యూజ్ లెస్” బాయ్ ఫ్రెండ్స్ గురించి చెప్పింది.