పెళ్లికి నా ప్లాన్స్ నాకున్నాయి: తాప్సి

ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనే విషయంలో తనకు క్లారిటీ ఉంది అని చెప్తోంది తాప్సి. ఆమె గత పదేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ తో డేటింగ్ లో ఉంది. ఇండియా వచ్చినప్పుడు తాప్సితో ఉంటాడు మాథిస్ బో. మిగతా సమయాల్లో విదేశాల్లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ఆడుతుంటాడు. లేదా పర్యటనలు చేస్తుంటాడు.

మరి పెళ్లి మాట లేదా అన్న ప్రశ్నకు ఈ భామ స్పందించింది.

“మాథిస్, నేను అన్ని విషయాల్లో కలిసిపోయాం. మా ఆలోచనలు ఒకే తీరుగా ఉంటాయి. ఈ పదేళ్లలో మా బంధం మరింత బలపడింది. అతన్ని మా ఇంట్లో వాళ్లందరూ కుటుంబ సభ్యుడిగానే చూస్తారు,” అని చెప్పింది. అదంతా ఓకె… మరి పెళ్లి ఆలోచన లేదా?

“పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అవి నేను ఇతరులతో పంచుకోను,” అని తాప్సీ చెప్పింది. ఈ మాటకు అర్ధమేంటో?

Advertisement
 

More

Related Stories