
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మూవీ… ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొంది. యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఏప్రిల్ 1న విడుదల కానుంది. రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్” విడుదలైన వారం రోజులకే ‘మిషన్ ఇంపాజిబుల్’ థియేటర్లలోకి వస్తోంది. “ఆర్ ఆర్ ఆర్” సినిమా మింగేస్తుందేమో అన్న భయం ఈ మూవీ మేకర్స్ లో లేదు.
చిన్న చిత్రమే అయినా కంటెంట్ పరంగా స్ట్రాంగ్ గా ఉందనేది వారి ధీమా. అందుకే, “ఆర్ ఆర్ ఆర్” విడుదలైన ఒక వారం గ్యాప్ లోనే వస్తోంది ఈ మూవీ.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో పరిచయమైన స్వరూప్ RSJ దర్శకుడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా తాప్సీ నటించింది. పిల్లలు కీలక పాత్ర పోషిస్తారు ఈ కథలు.