పెళ్లి చేసుకుంటే తగ్గిస్తా: తాప్సి

Taapsee

హీరోయిన్ తాప్సి చాలాకాలంగా డేటింగ్ లో ఉందనే విషయం రహస్యమేమీ కాదు. ఇంటర్ నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ బో ఆమె ప్రియుడు. ఇటీవలే మతియాస్ తో కలిసి మాల్దీవుల్లో ఆమె వెకేషన్ ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. వాటిని ఆమే షేర్ చేసింది.

తన డేటింగ్ గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో మరింత క్లారిటీ ఇచ్చింది తాప్సి. “మతియాస్ నాకు దగ్గరివాడు. అందులో దాచుకునేదేమి లేదు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ వేర్వేరుగా ఉండాలి అనేది నా పాలసీ. అందుకే హీరోలతో, సినిమా రంగానికి చెందిన వారితో ఎప్పుడూ డేటింగ్ కి వెళ్ళలేదు,” అని చెప్పుకొచ్చింది.

మరి పెళ్లి తర్వాత నటిస్తారా అని అడిగితే, “ఎస్. .పెళ్లి తర్వాత ఇప్పుడు చేస్తున్న స్పీడ్ గా సినిమాలు చెయ్యను. ఏడాదికి ఒకటి, రెండు మాత్రం ఒప్పుకుంటా.” అని సమాధానం ఇచ్చింది.

More

Related Stories