వాళ్ళు విప్పితే తప్పులేదా?

Taapsee Pannu


హీరోలు అందరికి ప్యాకుల క్రేజ్ పట్టుకొంది. సల్మాన్ ఖాన్ తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి చిత్రసీమకు పాకింది. సిక్స్ ప్యాక్ అటెంప్ట్ చేయని హీరోలు చాలా తక్కువ. అంతే కాదు… నిఖిల్ లాంటి కుర్ర హీరోలు… తమ సిక్స్ ప్యాక్ పురోగతి ఇది అంటూ వారానికి ఒకసారి షర్ట్ విప్పేసి ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేశాడు.

చాలామంది హీరోలు అంతే… షర్ట్ లు, ప్యాంటులు విప్పేసి ఫోటోలు షేర్ చేస్తుంటారు. ఈ మధ్య కొందరు హీరోలు మీడియాకి విడుదల బైట్స్ లలో కూడా షార్టులు వేసుకొని దర్శనం ఇస్తున్నారు.

“కానీ ఈ హీరోలని ఎవరూ ప్రశ్నించరు, వాళ్ళు ఏమి చేసినా రైట్. అదే మేము పొట్టి స్కర్ట్ లు వేసుకున్నా… బీచుల్లో బికినీతో కనిపించినా అశ్లీలత అంటారెందుకని,” అని గట్టిగా ప్రశ్నిస్తోంది తాప్సి.

More

Related Stories