తాప్సినీ పట్టించుకోని జనం


బాలీవుడ్ కి ఇది కష్టకాలం. ఒకప్పుడు ఆమీర్ ఖాన్ సినిమా విడుదలైందంటే మొదటి వీకెండ్ 100 కోట్లు వచ్చేవి. కానీ, ఆయన నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ 10 రోజుల్లో 50 కోట్లు మాత్రమే తెచ్చుకొంది. ఆమీర్ ఖాన్ లాంటి పెద్ద హీరోకే ఇలాంటి దుస్థితి ఉన్నప్పుడు ఇక మిగతా హీరోయిన్లు, హీరోల సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

బాలీవుడ్ సినిమాలు చూడొద్దని ఒక ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా ప్రచారంతో బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా దెబ్బతింది. మరోవైపు, ‘కార్తీకేయ2’ వంటి తెలుగు సినిమాలు మాత్రం బాగా ఆడుతున్నాయి హిందీ మార్కెట్ లో.

తాజాగా తాప్సి నటించిన హిందీ చిత్రం ‘దో బారా’ విడుదలైంది. ఈ సినిమాకి మొదటి రోజు ఇండియా అంతా 75 లక్షలు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా కూడా థియేటర్లలో 4,5 కోట్లకు మించి వసూళ్లు సాధించేలా లేదు. ఆమె ఇటీవల నటించిన ‘శబాష్ మిథు’ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. అనురాగ్ కశ్యప్ తీసిన ‘దో బారా’ కూడా సరైన ఓపెనింగ్ తెచుకోకపోవడంతో… తాప్సిని కూడా బాలీవుడ్ ప్రేక్షకులు ఇగ్నోర్ చేస్తున్నారు అని అర్థమవుతోంది.

ఇప్పట్లో బాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో ఆడడం కష్టమే. ఓటిటి నుంచి మాత్రమే బాలీవుడ్ చిత్రాలు డబ్బులు రాబట్టుకోవాలి.

Advertisement
 

More

Related Stories