
టబుకి ఇప్పుడు 52 ఏళ్ళు. తెలుగులో ఇప్పటికే ఆమె తల్లి పాత్రలు పోషించింది. అల్లు అర్జున్ కి కూడా తల్లిగా నటించింది. మరోవైపు హిందీలో తల్లి పాత్రలతో పాటు “సెక్సీ” రోల్స్ చేస్తోంది. తాజాగా ఆమె కృతి సనన్, కరీనా కపూర్ తో కలిసి “క్రూ” అనే సినిమాలో నటించింది.
ఈ సినిమాలో ఆమె విమాన సిబ్బందిగా అంటే ఎయిర్ హోస్టెస్ పాత్రలో నటించింది. ఈ పాత్రలో ఆమె కొన్ని బూతు డైలాగులు చెప్పింది. కానీ టబు చెప్పిన ఆ డైలాగులకు సెన్సార్ బోర్డు ఇప్పుడు కత్తెర వేసింది. మొత్తం మూడు బూతు మాటలకు మ్యూట్ పడింది.
టబు ఈ వయసులో కూడా నటిగా ప్రధాన పాత్రలు దక్కించుకోవడం విశేషం. ఆమె మళ్ళీ బాలీవుడ్ లో నటిగా బిజీగా మారింది. గతేడాది మూడు సినిమాల్లో నటించిన టబు ఈ ఏడాది రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో మూవీ నిర్మాణ దశలో ఉంది.
ALSO CHECK: Tabu’s pose for ‘Crew’ promotions