టబు ఖాతాలో మరో హిట్!


ప్రస్తుతం బాలీవుడ్ కష్టాల్లో ఉంది. పెద్ద పెద్ద హీరోలకి కూడా హిట్స్ రావడం లేదు. హిట్స్ సంగతి తర్వాత కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా కనిపించడం లేదు. ఇంతటి సంక్షోభ సమయంలో కూడా టబు రెండు భారీ విజయాలు అందుకొంది.

ఈ ఏడాది వేళ్ళ మీద లెక్కపెట్టే విజయాలు మాత్రమే బాలీవుడ్ చూసింది. అందులో ఒకటి… కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ‘భూల్ భూలయ్య 2’ . ఇందులో టబు కీలక పాత్ర పోషించారు. తాజాగా అజయ్ దేవగన్ నటించిన ‘దృశ్యం 2’ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇందులో కూడా టబుది కీలక పాత్రే.

ఈ ఏడాది రెండు విజయాలు రావడంతో 51 ఏళ్ల టబుకి బాలీవుడ్ లో ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. అజయ్ దేవగన్ తన సొంత డైరెక్షన్ లో తీస్తున్న ‘భోళా’ (కార్తీ నటించిన ‘ఖైదీ’కి రీమేక్)లో ఆమెకి రోల్ ఇచ్చాడు. మరో రెండు సినిమాల్లో ఆమె కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

50 ప్లస్ వయసులో బిజీగా మారిన టబుని చూసి మిగతా హీరోయిన్లు కూడా స్ఫూర్తి పొందుతున్నారు. టబు బాలీవుడ్ ని రక్షిస్తోంది అంటూ కంగన రనౌత్ అంటోంది.

 

More

Related Stories