టబుకి కరోనా ఫియర్!

Tabu

సీనియర్ నటి టబు ప్రస్తుతం “భూల్ భూలయ్య 2” అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో. ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ. టబు ఒక కీలక పాత్ర పోషిస్తోంది. నిన్న షూటింగ్ లో ఉండగానే కార్తీక్ ఆర్యన్ కి కరోనా సోకినట్లు తేలింది. వెంటనే షూటింగ్ రద్దు చేసి హోమ్ క్వారెంటైన్ లోకి వెళ్ళిపోయాడు.

కియారా, టబు ఆయనతో షూటింగ్ లో పాల్గొన్నారు. వీరిద్దరూ ఇప్పుడు ఐసోలేషన్ లో ఉన్నారు. టబు వయసు 50 ఏళ్ళు. అందుకే, ఆమె భయపడుతోందట. ఆమెకి కూడా రెండు రోజులు ఆగి ఆర్టి-పీసీఆర్ టెస్ట్ చేస్తారు. టబు ఇక వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలని ఫిక్స్ అయింది. సీనియర్ హీరోలు, హీరోయిన్లు వ్యాక్సిన్ వేయించుకోవడంలో తాత్సారం చేస్తున్నారు.

టబు ప్రస్తుతం ఆంటీ, తల్లి పాత్రలోకి వచ్చేశారు. ఐతే, సినిమాలు మాత్రం సెలెక్టివ్ గా చేస్తున్నారు. గతేడాది ఆమె ‘అల వైకుంఠపురంలో’ తల్లి పాత్రలో కనిపించారు.

More

Related Stories