ఠాగూర్ మధు ‘అతి’కి ఎదురుదెబ్బలు

ఠాగూర్ మధు 'అతి'కి ఎదురుదెబ్బలు

‘అతి’ విశ్వాసం నిర్మాత ఠాగూర్ మధుకు సమస్యలు తెచ్చిపెడుతోందా? సమాధానం “ఎస్” అనే చెప్పాలి. ‘క్రాక్’ సినిమా రిలీజ్ కి ముందు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ తో పేచీ. ఇప్పుడు దర్శకుడితో గొడవ.

తమిళనాడుకి చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ కి డబ్బులు చెల్లించాలి, అది చెల్లించకపోతే తన సినిమా రిలీజ్ కాదని మధుకు తెలుసు. అయినా, ఆ డిస్ట్రిబ్యూటర్ తనని ఏమి చేస్తాడులే అని అతి విశ్వాసంతో పట్టించుకోలేదు. ఫలితం… పెద్ద దెబ్బ పడింది. జనవరి 9న ‘క్రాక్’ రిలీజ్ కాకుండా చేశాడు డిస్ట్రిబ్యూటర్. నానా తిప్పలు పడి ఆరోజు ఎలాగోలా సెకండ్ షో టైంకి ఇష్యూ సెటిల్ చేసుకున్నారు.

రిలీజ్ తర్వాత సినిమా పెద్ద హిట్ అయింది. ఐతే, ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేనికి డబ్బులు ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడట. అతను ఇప్పుడు ఠాగూర్ మధుపై ఫిర్యాదు చేశాడు.

చెన్నై డిస్ట్రిబ్యూటర్ తనకి చెల్లించాల్సిన డబ్బుల గురించి కోర్టులో కేసు వేసినప్పుడు… ఆ డిస్ట్రిబ్యూటర్ “ఫోర్జరీ ఒప్పందం” కోర్టుకు సమర్పించాడు అన్నట్లుగా “బ్లైండ్ ఐటమ్స్” రాయించుకున్నారు మధు. మరి ఇప్పుడు సొంత సినిమా దర్శకుడు చేసిన ఫిర్యాదుకు ఏమి రాయించుకుంటారో?

More

Related Stories