తైవాన్ లో ‘ఇండియన్ 2’ షూటింగ్

దర్శకుడు శంకర్ ఇన్నేళ్ల కెరీర్ లో ఒకేసారి రెండు సినిమాలు తీయలేదు. కానీ, ఈ సారి ఒక షెడ్యూల్ రామ్ చరణ్ సినిమా, మరో షెడ్యూల్ కమల్ హాసన్ సినిమా అంటూ అటు, ఇటు చక్కర్లు కొడుతున్నారు. కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’, రామ్ చరణ్ తో ‘గేమ్ ఛేంజర్’ తీస్తున్నారు శంకర్.

ఇటీవలే రామ్ చరణ్, కియారా అద్వానీపై హైదరాబాద్ లో ఒక పాట తీశారు శంకర్. ఇప్పుడు తైవాన్ చేరుకున్నారు. అక్కడ ‘ఇండియన్ 2′ (భారతీయుడు 2’) షూటింగ్ మొదలైంది.

తైవాన్ రాజధాని థాయ్ పే (Taipai) నగరంలోని నేషనల్ సాంస్కృతిక భవనం వద్ద నిల్చొని స్క్రిప్ట్ చదువుతున్న ఫోటోని శంకర్ షేర్ చేశారు. ఇక్కడ కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలు తీస్తారు.

‘ఇండియన్ 2’లో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రకుల్, సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో మరో జంటగా కనిపిస్తారు. ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా విడుదల చెయ్యాలనేది ప్లాన్. 20 రోజుల పాటు యాక్షన్ సీన్లు తీసి తిరిగి ఇండియాకి వస్తారు. జులైనాటికి మొత్తం షూటింగ్ పూర్తి అవుతుందట.

Advertisement
 

More

Related Stories