లిప్ కిస్సే బెస్ట్, టేస్ట్: తేజస్వి

Tejaswi

రియల్ లైఫ్ లో కూడా బోల్డ్ గా మాట్లాడే తేజస్వి.. తన లిప్ కిస్ అనుభవాల్ని ప్రేక్షకులతో పంచుకుంది. తెరపై ఫస్ట్ టైమ్ రియల్ లిప్ కిస్సు పెట్టానని, ఆ అనుభవం చాలా బాగుందని చెబుతోంది తేజస్వి

గతంలో ఓ సినిమాలో తేజస్వి లిప్ కిస్ పెట్టింది. కాకపోతే అది ఫేక్ అంటోంది. నిజంగా పెదాల్ని అందుకోలేదని చెబుతోంది. తాజాగా చేసిన ”కమిట్ మెంట్” సినిమాలో మాత్రం ప్రాపర్ గా లిప్ కిస్ పెట్టానని చెబుతోంది. పైగా హీరో తన ఫ్రెండ్ అవ్వడంతో, లిప్ కిస్ సీన్ ను బాగా ఎంజాయ్ చేశానని అంటోంది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. త్వరలోనే ఎదో ఒక ఓటిటి స్పేస్ లో రిలీజ్ అవుతుంది.

తెరపై ఫస్ట్ టైమ్ నిజంగా లిప్ కిస్సు పెడుతున్నాం కాబట్టి.. ఆ ముద్దు ఎవరికో ఇచ్చే కంటే ఫ్రెండ్ కు ఇస్తే బెటరని భావించిందంట తేజస్వి. అందుకే ఏరికోరి తన ఫ్రెండ్ నే హీరోగా తెచ్చుకుందట. అలా సిల్వర్ స్క్రీన్ పై తొలి లిప్ కిస్ పెట్టానంటోంది.

ఒకప్పుడు ముద్దుసీన్ అంటే మొహమాటం ఉండేదని, ఇప్పుడు అవన్నీ దాటుకొని వచ్చానని, ఎంతో మెచ్యూర్ అయ్యానని చెబుతోంది. క్యారెక్టర్ కోసం అవసరమైతే బికినీ కూడా వేసుకుంటానని అంటోంది. అందం ఉన్నప్పుడు చూపించుకోవాలని, ఓ 10 ఏళ్ల తర్వాత ఎలాగూ ఇంత మంచి బాడీ ఉండదని చెబుతోంది తేజస్వి మడివాడ.

Advertisement
 

More

Related Stories