‘రిచిగాడి పెళ్లి’పై థమన్ ప్రశంస

‘రిచి గాడి పెళ్లి’ అనే సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలోని “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” తనకి నచ్చిందని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారు మెచ్చుకున్నారు. ఈ పాటని ఖైలాష్ ఖేర్ పాడారు.

“ఏమిటిది మతి లేదా.. ప్రాణమా.. సాంగ్ చూశాను. అందరూ మంచి ప్రయత్నంతో ఈ సినిమా చేస్తున్నారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ లో కైలాస్ గారు బ్యూటిఫుల్ గా పాడారు, సత్యన్‌ చాలా బాగా కంపోజ్ చేశారు, ఈ సినిమా అందరికీ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,” అని అన్నారు తమన్.

“రిచి గాడి పెళ్లి” అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ, ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశామన్నారు దర్శకుడు కె.యెస్.హేమరాజ్.

 

More

Related Stories