అది డైమండ్ రింగ్ కాదంట!

- Advertisement -
Tamannaah


రామ్ చరణ్, ఆయన భార్య తమన్నకి ఒక భారీ గిఫ్ట్ ఇచ్చారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఆ గిఫ్ట్ ధరే కోట్లలో ఉంటుంది అని కూడా జాతీయస్థాయి వెబ్ సైట్లు రాశాయి. కానీ అది అంతా ఉత్తదే అని మరోసారి తేలింది. ఇప్పుడు అసలు విషయాన్ని తమన్న బయటపెట్టింది.

రామ్ చరణ్ భార్య తమన్నకి డైమండ్ రింగ్ ఇచ్చింది అన్న వార్తలకు స్పందిస్తూ ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. “మిమ్మల్ని నిరాశపరచడం ఇష్టం లేదు కానీ ఆ రోజు ఉపాసన, నేను బాటిల్ ఓపెనర్ తో ఫోటోషూట్ చేశాం. అది నిజమైన డైమండ్ రింగ్ కాదు,” అంటూ రాసుకొంది తమన్న.

గత కొంతకాలంగా జాతీయ స్థాయి పత్రికలు, వెబ్ సైట్లు, ఛానెల్స్ తెలుగు సినిమాలకు సంబంధించిన వార్తలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. దాంతో సోషల్ మీడియా ఏది వస్తే అది నిజమని నమ్ముతూ ఏది పడితే అది పబ్లిష్ చేస్తున్నాయి. ఆ తర్వాత తప్పు అని తేలినా పట్టించుకోవడం లేదు. ఒక వార్తతో జనాలని ఆకట్టుకున్నామా లేదా అన్నదే చూస్తున్నాయి ఈ మీడియా సంస్థలు. వార్తల్లో నిజం గురించి ఆలోచన లేదు.

తమన్నకి ఉపాసన డైమండ్ రింగ్ ఇచ్చింది అని, రామ్ చరణ్ కి రిలయన్స్ అధినేత బంగారు ఊయల బహుమతిగా పంపించాడు ఇలాంటి అబద్దపు వార్తలు అన్నీ అలా వైరల్ అయినవే.

More

Related Stories