ఇకపై మునుపటిలా ఉండదు: తమన్న

- Advertisement -


మొదటి వేవ్ కన్నా రెండో కరోనా వేవ్ జనాల జీవితాలను అతలాకుతలం చేసింది. దేశమంతా అదే పరిస్థితి. సినిమా ఇండస్ట్రీలో కూడా పరిస్థితి బాగాలేదు. ఇకపై షూటింగ్ ల తీరు కూడా మారుతుంది అని అంటోంది మిల్క్ బ్యూటీ తమన్న.

“గతంలో షూటింగ్ లొకేషన్ కి వెళ్తే అందరిని విష్ చేసేదాన్ని. ఆత్మీయంగా హగ్ చేసుకునేవాళ్ళం. ఇకపై అలా ఉండదు. కెమెరా ముందు నటించేటప్పుడు మినహా మిగతా టైమ్ లో మాస్క్ ధరించాల్సిందే. ఇదే చాలా కాలం కంటిన్యూ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గేవరకు మునుపటిలా షూటింగ్ చెయ్యలేం. ఎక్కువగా సెట్స్ లోనే షూటింగ్ చెయ్యాలి,” అని తమన్న చెప్తోంది.

గతేడాది ఆమెకి కరోనా సోకింది. దాన్నుంచి కోలుకొంది. ఆ తర్వాత రెండు వెబ్ సిరీస్ షూటింగులు పూర్తి చేసింది. మళ్ళీ షూటింగ్ లు మొదలైన తర్వాత ‘గుర్తుందా శీతాకాలం’, ‘సీటిమార్’, ‘మేస్ట్రో’ చిత్రాలని ఆమె పూర్తి చెయ్యాలి. ఇవి వరుసగా విడుదల కానున్నాయి.

 

More

Related Stories